జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు..

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ఈ రోజు కాల్పులు జరిగాయి. పశ్చిమ జపాన్ నగరమైన నారాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న షింజో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కూడా అయ్యాయి. అంతకంటే ముందు కాల్పుల శబ్దం వినిపించినట్టు చెబుతున్నారు. రక్తమోడుతున్న మాజీ ప్రధానిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు స్థానిక మీడియా తెలిపింది.

67 ఏళ్ల షింజే ఓ వీధిలో ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్టు ఎన్‌హెచ్‌కే అనే మీడియా సంస్థ తెలిపింది. రెండుసార్లు తుపాకి కాల్పుల వంటి శబ్దం వినిపించిందని, ఘటనా స్థలంలోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

Leave A Reply

Your email address will not be published.