300 మీటర్ల జాతీయ పతాకంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన విద్యార్థులు

ఆజాదీకాఅమృత మహోత్సవాల్లో భాగంగా పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మూడు వందల మీటర్ల జాతీయ పతాకం తోటి ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిలిమంజారో పర్వతారోహకుడు ఆలూరి సాయి కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ, 2019 వ సంవత్సరం లో దక్షిణాఫ్రికాలోని టాంజానియా లోని కిలిమంజారో పర్వతం అదిరోహించినట్లు తెలియజేశారు. పాఠశాల స్థాయిలోనే క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక దృఢత్వాన్ని సాధించవచ్చని తెలియజేశారు.

ఇలాంటి పర్వతాలు అధిరోహించాలంటే మనం శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే సాధించగలమని తెలియజేశారు.ప్రధానోపాధ్యాయురాలు లింగాల ధనలక్ష్మి మాట్లాడుతు, విద్యార్ధులు చిన్నతనం నుండి దేశం పట్ల ప్రేమ కలిగిఉండాలని,ఏందరో స్వాతంత్ర సమరయేదుల త్యాగ ఫలం మనం అనూభవిస్తున్నామని ఈ సందర్భంగా వారందరిని స్మరించుకోవాలని కొరారు.ఏన్ సి సి ఆఫీసర్ ఆదూరి ఇమ్మానేయుల్ రాజు,కమల కూమారి ఆధ్వర్యంలో ఏన్ సి సి కెడెట్ల్ ర్వాలీ నిర్వహించారు. పిడుగురాళ్ళ పట్టణంలో పోలీస్ డిపార్ట్ మెంట్ సహాకరంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడమైనదని తెలియజేశారు.విద్యార్ధులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.