TDP Payyavula Keshav ప‌య్యావుల కేశవ్‌కు భ‌ద్ర‌త పున‌రుద్ధ‌ర‌ణ‌

టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పురం ఉవ‌ర‌కొండ ఎమ్మెల్యే, ప్ర‌జా ప‌ద్దుల క‌మిటీ (పీఏసీ) అధ్య‌క్షుడు ప‌య్యావుల కేశవ్ భ‌ద్ర‌త విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కేశ‌వ్‌కు భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రిస్తూ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం వెనక్కు తీసుకుంది. గ‌తంలో ఏ స్థాయిలో అయితే కేశవ్‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్నారో… అదే త‌ర‌హాలో భ‌ద్ర‌త‌ను పున‌రుద్ధ‌రిస్తూ ఉత్వ‌ర్వులు జారీ చేసింది.

టీడీపీ ఎమ్మెల్యేగానే కాకుండా పీఏసీ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌య్యావుల‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టిదాకా 1 ప్ల‌స్ 1 భ‌ద్ర‌త‌ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప‌య్యావుల‌కు సెక్యూరిటీ ప‌నిచేస్తున్న గ‌న్‌మెన్ల‌ను సోమ‌వారం ఉద‌యం వెన‌క్కు పిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌య్యావుల‌కు భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. సోష‌ల్ మీడియా వేదిక‌నూ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ప‌లువురు పోస్టులు పెట్టారు. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ కూడా ఘాటుగానే స్పందించింది.

పీఏసీ చైర్మ‌న్‌కు భద్ర‌త తొల‌గించిన వైనంపై అన్ని వైపుల నుంచి విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు సమాచారం. అంతేకాకుండా పయ్యావుల‌కు భ‌ద్ర‌త‌ను ఉప‌సంహ‌రించే దిశ‌గా యోచించిన ప్రభుత్వం… అప్ప‌టిదాకా ప‌య్యావుల‌కు భ‌ద్ర‌త‌గా ప‌నిచేస్తున్న గ‌న్‌మెన్ల‌ను అప్ప‌టికే వెన‌క్కు పిలిచిన ప్ర‌భుత్వం… వారి స్థానంలో కొత్త గ‌న్‌మెన్ల‌ను నియ‌మించింది. ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టిదాకా త‌న‌కేమీ స‌మాచారం లేద‌ని ప‌య్యావుల పేర్కొన‌డం గ‌మ‌నార్హం.
Andhra Pradesh, TDP Payyavula Keshav, PAC Chairman, YSRCP Security

Leave A Reply

Your email address will not be published.