ఏపీ త్యాగవీరులు, మహనీయులు పుట్టిన పుణ్యభూమి: మోడీ

ఏపీ త్యాగవీరులు, మహనీయుడు పుట్టిన పుణ్యభూమి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి కుటుంబ సభ్యులను ప్రధాని మోడీ సన్మానించారు.

పెద్ద అమిరంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… జాతీయ జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి మహనీయులు ఇక్కడ పుట్టారన్నారు. అల్లూరికి దేశం తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. మొఘల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పోలీస్ స్టేషన్ ను డెవలప్ చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.