కేంద్ర అట‌వీ శాఖ మంత్రితో అంబ‌టి రాంబాబు భేటీ… ప‌ల్నాడు ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాల‌ని విన‌తి

ఏపీ జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంపై కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో భేటీ కోసం బుధ‌వారం ఢిల్లీ వెళ్లిన ఏపీ జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు.. ఆ భేటీ అనంత‌రం మ‌రో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుల‌ను వెంట‌బెట్టుకుని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ శాఖ మంత్రి భూపింద‌ర్ యాద‌వ్‌ను అంబ‌టి రాంబాబు క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా త‌న సొంత జిల్లా ప‌ల్నాడు జిల్లాలోని వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని రాంబాబు కోరారు. ప‌ల్నాడు ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రికి రాంబాబు విన్న‌వించారు.

Leave A Reply

Your email address will not be published.