సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఏపీఎండీసీ రూ.5 కోట్ల విరాళం

ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు ఏపీలోని గోదావ‌రి న‌దీ ప‌రీవాహక ప్రాంతాలు నీట మునిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌ర‌ద బాధితుల కోసం ఏపీ ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ప్రభుత్వం వ‌ర‌ద బాధితుల‌కు అందిస్తున్న సాయానికి ద‌న్నుగా నిలిచేందుకు ఏపీ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ముందుకు వ‌చ్చింది. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్‌)కి రూ.5 కోట్ల విరాళాన్ని అంద‌జేసింది.

ఈ మేర‌కు ఆ సంస్థ త‌ర‌ఫున రూ.5 కోట్ల చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సోమ‌వారం సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అంద‌జేశారు. వ‌ర‌ద ప్రాంతాల్లో బాధితుల‌ను ఆదుకునేందుకు ఈ నిధుల‌ను వాడుకోవాల‌ని ఆ సంస్థ ప్ర‌భుత్వాన్ని కోరింది.

Leave A Reply

Your email address will not be published.