శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ప్రముఖులు

Srikalahasthi Temple ప్రముఖ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు పూతలపట్టు శాసనసభ్యులు శ్రీ యం. యస్. బాబు గారు కుటుంబ సమేతంగా వారికి ఆలయ చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తదుపరి వారు స్వామి అమ్మవార్ల అభిషేకములను దర్శించినారు. తదనంతరం దక్షణమూర్తి స్వామి వారి సన్నిధి వద్ద శేష వస్త్రాలతో సత్కరించి వేదంపండితులతో  ఆశీర్వచనాలు ఇప్పించి స్వామి-అమ్మ వార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు సాధనమున రాయల్ ఆలయ అధికారులు Ac మల్లికార్జున ప్రసాద్ తదితరులు వైఎస్ఆరసీపీ నాయకులు పసలు కుమార్ స్వామి,నర్సింహులు,బలగౌడ్,తేజ, సునీల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదానమునకు విరాళంగా తిరుపతి జిల్లా, నాయుడుపేట, మారేపల్లి వాస్తవ్యులు నెల్లూరు సాయి కుమార్ రెడ్డి కుటుంబం వారు రూ.50,116/- (యాభైవేల నూట పదహారు రూపాయలు)  విరాళంగా శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారికి అందజేశారు. స్వామి-ఆమ్మ వార్ల సేవలో భాగంగా అన్నదాన ప్రసాదాలకు  విరాళాలు అందజేసిన వారి కుటుంబానికి తల్లి జ్ఞానప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వరుని కృపా కటాక్షములు ఎల్లప్పుడూ ఉంటాయని ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు Ac మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు అంగరంగ వైభవంగా నిర్వహించు అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం కార్యక్రమానికి భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేయు సందర్భంగా శ్రీకాళహస్తి తొట్టంబేడు తాలూకా లారీ అసోసియేషన్ వారు నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమమునకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు ముఖ్యఅతిథిగా విచ్చేసినారు.

ముందుగా లారీ అసోసియేషన్ వారు కాశి సుబ్రహ్మణ్యం, ప్రభాకర్ రెడ్డి, చిరంజీవి రెడ్డి, జయశంకర్, గోపి, యుగంధర్, సాయి, రవి తదితరులు చైర్మన్ అంజూరు శ్రీనివాసులు గారిని ఆహ్వానించి శాలువాలతో సత్కరించి అన్నదానం కార్యక్రమమును చెర్మన్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం బోర్డు సభ్యులు పసల సుమతి, సాధన మున్నా రాయల్ మరియు కోళ్లూరు హరి, బాలా గౌడ్, సునీల్, తేజ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.