ఢిల్లీలో దోస్తి… ఆంధ్రలో కుస్తి

విజయవాడ, జూలై 2: ఎవ‌రైనా ఇంట గెలిచి ర‌చ్చ‌గెల‌వ‌మంటారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వ్య‌వ‌హారం ఇందుకు భిన్నంగా వుంది. ఢిల్లీ నాయ‌కుల‌తో దోస్తానా ఎటువంటి ఇబ్బందిలేదు. కానీ స్వ‌ప‌క్షం వారితోనే త‌ల భారం పెరిగింది. ముందున్నంత స‌ఖ్యంగా ఎక్క‌డా ఎవ్వ‌రూ లేరు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో విభేదాలు త‌లెత్తుతున్నాయి. వీటిని స‌ద్దుమ‌ణిగేలా చేయ‌డానికి ప్ర‌త్యేకంగా స‌మ‌యం తీసుకొన‌వ‌ల‌సి వ‌స్తోంది. అయినా వైసీపీ 175 సీట్లు వ‌స్తాయ‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. పార్టీ ప్లీనరీపైనే ఆంధ్రా రాజకీయం ఆధారపడి ఉందంటున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రా రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందనేది రాజకీయ కురు వృద్ధులకు కూడా అంతుచిక్కడం లేదు. వైసీపీ- బీజేపీల అంతర్యం ఏమిటో, వారి భవిష్యత్ వ్యూహం ఏంటో కూడా రాజకీయ మేధావులకు సైతం అంత ఈజీగా అంతుబట్టడం లేదు. సీఎం జ‌గ‌న్ ఢిల్లీ ప్రయాణం క‌ట్టిన‌పుడ‌ల్లా ఇక్క‌డి పార్టీ వ‌ర్గాలు రాష్ట్ర అంశాల‌ను చ‌ర్చించ‌డానికి వెళుతు న్నార‌ని భారీ ప్ర‌చారం చేస్తారు. ఆయ‌నక ఆయ‌న తిరిగి రాగానే ఏదో స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన‌ట్టు నివాసానికో, పార్టీ ఆఫీసుకో వెళ్ల‌డం ఆన‌వాయితీగా మారింది.

కానీ అక్క‌డ నాయ‌కుల్ని ప్ర‌స‌న్నం చేసుకోవ డంలో ఆంత‌ర్యం వేర‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి అవసరమైన చోటల్లా ప్రత్య క్షంగానే మద్దతు తెలుపుతూనే ఉన్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదా నికి వచ్చినప్పుడల్లా చెయ్యెత్తి జై కొడుతూనే ఉన్నారు. రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతుల ఎన్నికల సమయంలో కేంద్రం నిర్ణ యించిన వ్యక్తికే తమ ఓటు అని అధికారికంగానే ప్రకటిస్తూనే వస్తున్నారు. ఇక్క‌డ ఏపీలో మాత్రం వైసీపీ, బీజెపీల మ‌ధ్య ఏది ప‌డినా బుగ్గ‌య్యేంత క‌య్యాలు నెల‌కొన్నాయి. ఎన్ని క‌లు వ‌చ్చిన‌పుడ‌ల్లా ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల యుద్ధానికి అంతే వుండ‌దు. నోటికీ అడ్డూ ఆపూ వుండదు. అంతెందుకు ఇరు పార్టీల అధినాయ‌కుల పోక‌డ‌లు జిమ్మిక్కుల లాజిక్కు బొత్తిగా అర్ధంగాక ఇరు పార్టీల వ‌ర్గాలూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అనేక కీలక పరిణామాల పట్ల అస్సలు స్పందించని జగన్.. మళ్ళీ పార్టీని అధికారంలోకి తేవడానికి, మొత్తం 175 సీట్లు సాధించడానికి ఏం మాయ చేస్తారో..? అని వైసీపీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. జ‌గ‌న్ దేశంలోని ముఖ్య‌మంత్ర‌లుంద‌రి క‌న్నా చిన్న‌ వ‌య‌సు వారు. తండ్రి వారసత్వాన్ని అంది పుచ్చుకు ని పార్లమెంటు సభ్యుడి హోదా నుండి ఏకంగా సీఎం స్థానాన్ని అందుకున్నారు. ఆయ‌న‌కు మంత్రిగా చేసిన అనుభ‌వం లేదు. కానీ, కేంద్రంలో బిజేపీ అగ్ర‌నేత‌లు మోడీ, అమిత్ షాతో స‌ఖ్య‌త పాటించ‌డం, విజ‌యవంతంగా కొన‌సాగించ‌డంలో నైపుణ్యం ప్ర‌ద‌ర్శిస్తు మోడీ ద‌త్త‌పుత్రుడు అనే పేరు మాత్రం సంపా దించారు. ఏకంగా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అలా జ‌గ‌న్‌ను ప్ర‌శంసించారంటే జ‌గ‌న్ కేంద్రంలో స్నేహ‌బంధాలు మ‌హా గ‌ట్టి ప‌డ్డాయ‌నే అనాలి.

ఢిల్లీ లో అంత‌లా అంటకాగుతున్న వైసీపీ, బిజెపీ స్నేహం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బెడిసి కొట్టింద‌నే అనాలి. బిజెపీనీ ఆమ‌డ దూరం పెట్టడమే కాకుండా, తమ పార్టీ నేతలతో తిట్టిస్తున్నారు కూడా. లీడర్ ఆదేశాలతో వైసీపీ నేతలు త‌మ నోటి దురుసు బాగా ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్న‌ది బీజేపీ వ‌ర్గాల గోల‌. ఆంధ్ర‌లో పెరిగిపోతున్న ఈ వైష‌మ్యాల‌కు పెద్ద ఉదాహ‌ర‌ణే ఇటీవ‌లి ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఇటీవలే జరిగిన ఉప ఎన్నికలో వైసీపీనేతలు బీజేపీకి డిపాజిట్ రాకుండా చేశారు. ఢిల్లీలో తమ అధినాయకుడు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీ నిర్దయించిన ద్రౌవది ముర్ముకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన పలు హామీలు సాధించ కుండానే ప్రధాని నిర్ణయించిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఎలా ఇస్తారని ప్రశ్నించే వారికి జగన్ సమాధా నమే చెప్పరు. అలా ఎందుకు చేస్తున్నారని అడిగే ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదనేది వాస్తవం అంటున్నా రు రాజకీయ పరిశీలకులు.

Leave A Reply

Your email address will not be published.