ప్రాణం ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటా మాజీ మంత్రి బాలినేని

తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు కొందరు కావాలని నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైయస్ కుటుంబం లోనే ఉంటానని ప్రాణం ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటాననీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేనేతల కోసం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో  మంచి ఉద్దేశంతోనే రెస్పాండ్ అయ్యారు అని బాలినేని స్పష్టం చేశారు.

ఆదివారం, ఆగస్ట్ 7 న National Handloom Day జరిగింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల మధ్య చేనేత ఛాలెంజ్ నడిచింది. నేతల మధ్య ఛాలెంజ్‌లు రక్తికటించాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్ వేదికగా ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. ఆనంద్ మహీంద్రా, సచిన్ టెండూల్కర్‌, పవన్‌ కల్యాణ్‌లు చేనేత వస్త్రాలు ధరించి ఫోటోలు పోస్ట్ చేయాలని ఛాలెంజ్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ ఛాలెంజ్‌ స్వీకరించారు జనసేనాని పవన్ కల్యాణ్‌. రామ్‌ భాయ్‌ ఛాలెంజ్ స్వీకరించా అంటూనే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ను నామినేట్ చేశానంటూ ట్వీట్‌ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.