ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు విశేష స్పందన

చిత్తూరు జిల్లాప్రధాన కార్యదర్శి చిట్టి బాబు కొల్లా ఆధ్వర్యంలో, గుడిపాల మండలం బొమ్మసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు జన జాగృతి సంస్థ, ఎస్ ఎస్ ఫార్మా, బెంగళూరు వైదేహి మెడికల్ కాలేజ్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. బొమ్మసముద్రం, నంగమంగళం, మరకాల కుప్పం, మంది కృష్ణాపురం గ్రామాల నుండి సుమారు 200 మంది ప్రజలు మెడికల్ క్యాంపులో ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, జిల్లా మెడికల్ సెల్ కన్వీనర్ సోమశేఖర్, మండల బీజేవైఎం ఉపాధ్యక్షులు సాయి ప్రతాప్, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ శోభన్ బాబు, జిల్లా మీడియా ఇంచార్జ్ రామభద్ర, మండల కార్యదర్శి శ్రీధర్ రెడ్డి మరియు ఇతర బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.