ఎంపీ పదవికి గోరంట్ల మాధవ్ రాజీనామా చేయాలి.. గంటా నరహరి

MP Gorantla Madhav Nude Selfie Video గోరంట్ల మాధవ్ అసభ్యకరమైన వీడియో కాల్ కు సంబంధించి ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజాప్రతినిధుల దగ్గరకు వస్తారు కానీ ఏదైనా సమస్యల పై వైసీపీ నేతల దగ్గరకు వెళ్ళాలంటే ఆంధ్రరాష్ట్రంలో మహిళలు భయంతో వణికిపోతున్నారని రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటా నరహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మదనపల్లి మీడియాతో మాట్లాడారు.ఆయన మాటల్లో.. నాయకులు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కానీ వైసీపీ నేతలు రేపిస్టులకు, మహిళలను వేధించే ఆకతాయిలకు ఆదర్శంగా మారడం సిగ్గుచేటు. సీఎం జగన్ రెడ్డి కి మహిళలపై సాధికారిత,భద్రతపై చిత్తశుద్ధి ఉంటే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ లపై ఆనాడే చర్యలు తీసుకుని ఉంటే నేడు గోరంట్ల మాధవ్ అనే మరో మానవ మృగం వల్ల యావత్ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చేదా? ఆనాడే వారిపై జగన్ రెడ్డి చర్యలు తీసుకుని ఉంటే నేడు గోరంట్ల మాధవ్ ఈ పనికి పాల్పడేవాడు కాదు,ఇది ముఖ్యమంత్రి వారిని ప్రోత్సహించడం కాదా అని ప్రశ్నిస్తున్నాను. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలనలో గాంధీజీ కోరుకున్నట్లు అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా తిరగడం కాదు కదా ఆంధ్రప్రదేశ్ లో కనీసం పట్టపగలు మహిళలు రోడ్లపై తిరగలేని భయానక పరిస్థితులు నెలకొన్నాయి.ఇలాంటి క్రిమినల్స్ కి టికెట్లు ఇచ్చి పార్లమెంటుకు పంపి అత్యున్నత చట్టసభ గౌరవాన్ని దిగజార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

జగన్ రెడ్డి ఇలాంటి క్రిమినల్స్ రేపిస్టులను దొంగలను రాబందుల్లా ప్రజల మీదకు వదిలి దేశవ్యాప్తంగా ఏపీ పరువు ప్రతిష్టలను నాశనం చేశారు. గోరంట్ల మాధవ్ పై ఏం చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజలకు చెప్పాలి.గోరంట్ల మాధవ్ తీరుతో యావత్ మహిళా సమాజం సిగ్గుపడుతుంది. ఆయనపై దిశ చట్టం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. మహిళలను లైంగికంగా వేధించిన గోరంట్ల మాధవ్ లాంటి క్రిమినల్స్ కి పార్లమెంట్ లో ఉండే అర్హత లేదు.తను చేసిన అసభ్యకరమైన పనికి మాధవ్ వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలి.ప్రజల సమస్యల కోసం పని చేయాల్సిన పవిత్రమైన పార్లమెంటు సభ్యుడిగా ఉండీ ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగిలిపోతుంది.జగన్ రెడ్డి మహిళలపై అఘాయిత్యాలు నేరాల విషయంలో మాత్రం అగ్రస్థానంలో నిలిపారు.

Leave A Reply

Your email address will not be published.