అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులా.!! జనసేన

అవినీతిపరులను టీటీడీ పుణ్యక్షేత్రం నుంచి తొలగించమన్నందుకు, జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దారణమని ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు. టీటీడీ పాలకమండలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టువంటి భూదాటి లక్ష్మీనారాయణ ను బర్త్ రఫ్ చేసి టిటిడి పవిత్రతను కాపాడాలని, అలిపిరి వద్ద మంగళవారం జనసేన పార్టీ నిరసన చేపట్టిన విషయం విదితమే. టీటీడీ బోర్డు మెంబర్ భూదాటి లక్ష్మీనారాయణ మరికొందరు పెద్దలనే వ్యక్తులు పోలీస్ అధికారుల పై ఒత్తిడి చేసి జనసేన నాయకులపై అక్రమ కేసులు పెట్టించి, బుధవారం అలిపిరి పోలీస్ స్టేషన్ వద్దకు వొచ్చి నోటీసులు తీసుకోవాలని పోలీసు అధికారులతో ఒత్తిడి చేసిన స్టేషన్ వద్దకు రావాలని కోరడంతో జనసేన నాయకులు జనసైనికులు, వీరమహిళలతో కలిసి తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ లకు నోటీసులు ఇవ్వడంపై మీడియా ముఖంగా కిరణ్ మాట్లాడుతూ.

తిరుమల తిరుపతి దేవస్థానం లో కానీ భారత రాజ్యాంగంలో కానీ కొబ్బరికాయలు కొట్టకూడదని ఎక్కడైనా చట్టం ఉందా అని, టిటిడి పాలకమండలిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు చేపట్టి అతనిని వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రశ్నించినందుకు గాను మాపై బోర్డు మెంబర్ భూదాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి పెద్దల ముసుగులో ఉన్న మరి కొందరు పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకొని వచ్చి, టెంకాయలు కొట్టామనే సాకు పెట్టి అక్రమ కేసులు నమోదు చేయించడం హాస్యాస్పదమని, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అవినీతి ఎదుర్కొంటున్న బోర్డు మెంబర్ను తొలగించమని అడిగినందుకు కేసు పెడుతున్నామని చెప్పి పెట్టండి అంతేగాని ఎక్కడా లేని విధంగా టెంకాయలు కొట్టారు, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకున్నారు, మహిళలు పువ్వులు పెట్టుకున్నారు అని కేసులు పెట్టడం అవివేకమని హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వున్నాయని, దీనిపై పీఠాధిపతులు, మఠాధిపతులు స్పందించి హిందూ సంప్రదాయాలను టీటీడీ ధార్మిక సంస్థలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇలాంటి కేసులకు జనసేన పార్టీ భయపడే ప్రసక్తే లేదని అవినీతిని ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి మరియు జిల్లా, పట్టణ, రాష్ట్ర స్థాయి నాయకులు ఆకేపాటి సుభాషిని, బాబ్జి, సుమన్ బాబు, కీర్తన, కొండా రాజ మోహన్, అమృత, మునస్వామి, లక్ష్మీ, దిలీప్, రాజేష్, లు మాట్లాడుతూ “ఆయన ఏమైనా దేశం కోసం పోరాడినటువంటి వ్యకినా అని అవినీతి ఎదుర్కొంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రశ్నిస్తే మాపై కేసులు పెడతారా అని, మీ తాటాకు చప్పుళ్ళకు, ఇలాంటి కేసులకు భయపడేదే లేదని, వైసీపీ ప్రభుత్వం లో అన్ని అవినీతి, అక్రమాలేనని, చాలావరకు అక్రమ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే పదవులలో వున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించినందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి లో టెంకాయలు కొట్టామని సాకు చూపి కేసులు పెట్టడం లాంటివి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, గతంలో కూడా టిటిడి లో చాలా సంఘటనలపై జనసేన పార్టీ తరపున నిరసనలు తెలియజేశామని, ఇలాంటి కేసులు ఎప్పుడు మేము వినలేదు, చూడలేదని కేవలం అవినీతిపరులు గుట్టు బయట పడుతుందని దురుద్దేశంతో వారు పోలీసు అధికారులపై ఒత్తిడిలు తెచ్చి మా నాయకులపై, వీరమహిళలపై, జనసైనికులపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టారని, ఎలాంటి కేసులుకైనా సరే జనసేన పార్టీ నాయకులు తగ్గే ప్రసక్తే లేదని, ఇప్పటికైనా టీటీడీ పాలకమండలిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీనారాయణ ను బర్తరఫ్ చేయాలని, లేని పక్షాన అలిపిరి వద్ద పెద్ద ఎత్తున ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.