సిరులు కురిపిస్తున్న అక్రమ నిర్మాణాలు

  • నిబంధనలకు విరుద్ధంగా 39వ వార్డులో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు…
  • చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది…

విశాఖపట్నం: అక్రమ నిర్మాణాలకు జీవీఎంసీ జోన్-4 నిలయంగా మారిపోయింది. అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్న విషయం గురించి ఇక్కడి
టౌన్ప్లానింగ్ సిబ్బందికి ఫిర్యాదులు వచ్చినా మామూళ్ల మత్తులో పడి చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమ భవన నిర్మాణాల జోరు ఊపందుకుంటున్నాయి. స్థానిక 39వ వార్డు, అదనపు అంతస్తు లు ఇప్పటికైనా దిష్టి పెట్టి పలు చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ తొలగించే కార్యక్రమం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.

కందుల వారి వీధిలో అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జి ప్లస్ టు భవన నిర్మాణాలు పక్క పక్కనే రెండు జరుగుతున్నాయి. జి ప్లస్ టు భవన నిర్మాణం చేపట్టాలంటే తప్పనిసరిగా సెల్లార్ ఉండాలి. సెల్లార్ లేకుండా, సెట్ బ్యాకులు వదలక పోవడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ భవన నిర్మాణాలకు ముకుతాడు వేయాల్సిన ప్లానింగ్ సెక్రటరీ, చైన్ మాన్లకు భారీగా ముడుపుల అందినట్టు ప్రచారం జరుగుతుంది.

ఫిర్యాదులు అందిన టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫలితంగా జివిఎంసికి రావాల్సిన లక్షలాది రూపాయల ఆదాయం గండి పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జీవీఎంసీ కమిషనర్, సిటీ ప్లానర్ రంగంలోకి దిగి ప్లాన్ కు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ భవన నిర్మాణాలను కట్టడి చేయాలని, లేనిపక్షంలో భారీ ఆదాయాన్ని జీవీఎంసీ కోల్పోవాల్సి ఉంటుందని అక్కడి వారు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.