జనసేన దృష్టికి ఇంతేరు భూ ఆక్రమణల వ్యవహారం

పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండల పరిధిలోని ఇంతేరు తీర ప్రాంతంలో ప్రభుత్వ భూమి, మడ అడవులు, సి.ఆర్.జెడ్. పరిధిలో ఉన్న వేల ఎకరాల భూములు ఆక్రమించి చెరువులు తవ్వేసిన వ్యవహారాన్ని గురువారం జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. మంగళగిరి పార్టీ కార్యాలయంలో శ్రీ మనోహర్ గారిని కలసి ఇంతేరు భూబకాసురులు ఏ ప్రాంతంలో ఎంత భూమి ఆక్రమించారు.. నిబంధనలు ఏ విధంగా తుంగలో తొక్కారు అనే అంశాలను వివరించాము.

జనసేన పార్టీ తరఫున ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, చేపట్టబోయే ఆందోళనలు, తదుపరి కార్యచరణకు ఆయన నుంచి అనుమతి కోరాము. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు వేల ఎకరాల్లో భూములు కబ్జా చేసి.. చెరువులు తవ్వేస్తుంటే యంత్రాంగం చోద్యం చూస్తుండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం మీద వెంటనే గౌరవ హైకోర్టులో పిల్ దాఖలు చేయాలని సూచించారు. శ్రీ మనోహర్ గారి సూచన మేరకు జనసేన పార్టీ తరఫున త్వరలో న్యాయ పోరాటానికి దిగనున్నామని పెడన నియోజకవర్గ ప్రజలకు, ఆక్రమణల బాధిత ప్రాంతాల ప్రజలకు తెలియచేస్తున్నాం.

Leave A Reply

Your email address will not be published.