జీవితాన్ని ఎలా గడపాలో నేర్పిన గాంధీ

నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీజీ నేర్పారని, చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతమని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.‌వి.రమణ తెలిపారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ ‘నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో గాంధీ నేర్పారు. చెడును ప్రేమతో ఎదుర్కోవడం ఎంతో సాహసోపేతం. ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. చాలావరకు హింసాపూరిత వాతావరణంలోనే సాగాయి. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాడిన విషయం తెలిసిందే. సత్యశోధన పుస్తకం ద్వారా గాంధీని మరోసారి గుర్తు చేసుకుం టున్నాం. గాంధీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రశంసనీయం అన్నారు. మహాత్మా గాంధీజీ రెండుసార్లు తిరుపతికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1921లో మొదటిసారి, 1933లో రెండోసారి ఆయన తిరుపతికి వచ్చారు.

తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌ ‌రెడ్డి నాకు ఆప్తమిత్రుడు, అపూర్వ సహౌదరుడు. ఆయన్ను పార్టీలు సరిగా ఉపయోగించుకోలేదు. తెలుగు భాష, సంస్క•తి పట్ల ఆయనకు మక్కువ ఎక్కువ. చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు అని సీజేఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ ‌రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ జీవన సందేశాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఎన్వీ రమణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సత్యశోధన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకమని అన్నారు. ఈ సందర్భంగా మహాత్మ గాంధీ సేవలను కొనియాడారు. అహింస అనే ఆయుధంతో గాంధీజీ పోరాటం చేసారని.. నిజాయతీగా జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించిన వ్యక్తం గాంధీజీ అని అన్నారు.

ఇదిలావుంటే రాస్‌ ‌నిర్వాహకులు, పద్మశ్రీ గ్రహీత స్వర్గీయ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ… ఎన్‌.‌జీ.రంగ, వివోభాబావే, రాజగోపాలనాయుడు వంటి స్వాతంత్య ్రసమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పని చేసిన వ్యక్తి మునిరత్నం అని తెలిపారు. మహిళలు, రైతులకు రాస్‌ ‌సంస్థ ద్వారా సేవలు అందాయన్నారు. సంస్థ మరింత అభివృద్ది చెందాలని సీజేఐ ఎన్వీ రమణ ఆకాంక్షించారు. అంతకుముందు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.