సీఎం పర్యటనను విజయవంతం చేద్దాం

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఆదోని: అధికారులంతా సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ పి కోటేశ్వరరావు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అధికారులను ఆదేశించారు ఆదోని లో సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ ఎస్పి కలిసి ఏఎస్ఎల్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైసన్) నిర్వహించారు ఆదోని హార్డ్ అండ్ సెన్స్ కాలేజీలో హెలిపాడ్ మున్సిపల్ హై స్కూల్ నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేస్తున్న వేదిక ను పరిశీలించారు అనంతరం నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేదికపై ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

సభా ప్రాంగణం మొత్తం 8 కంపార్ట్మెంట్లు ఉండగా ఒకటి వీఐపీల కోసం 1 పాత్రికేయుల కోసం మిగతా కంపార్ట్మెంట్లు పిల్లలు వారి తల్లిదండ్రులు ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు సభా ప్రాంగణానికి వచ్చే పిల్లలకు అల్పాహారం తో పాటు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ .ఎస్ రామ్ సుందర్ రెడ్డి కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ్ తేజ ఆదోని ఆర్డిఓ రామకృష్ణారెడ్డి ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి డీఈవో రంగారెడ్డి ఎస్ ఎస్ ఏ పిఓ వేణుగోపాల్ జెడ్పిసి ఈ ఓ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.