విశాఖ ఆర్కే బీచ్ వద్ద వివాహిత గల్లంతు

పెళ్లి రోజు సందర్భంగా సరదాగా భర్తతో కలిసి గడుదామని విశాఖలోని ఆర్కే బీచ్ కు వచ్చిన ఓ వివాహిత సముద్రంలో గల్లంతయింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ఏడీ ప్రాంతానికి చెందిన సాయిప్రియ తన భర్త శ్రీనివాస్ తో కలిసి ఆర్కే బీచ్ కు వచ్చింది. సముద్ర తీరంలో కాసేపు సరదాగా గడిపిన తర్వాత తిరిగి వెళ్లిపోవడానికి వారు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాళ్లు కడుక్కోవడానికి సాయిప్రియ మళ్లీ సముద్ర తీరానికి వెళ్లింది.

ఆ సమయంలో భర్త శ్రీనివాస్ సరిగా గమనించలేదు. కాసేపటి తర్వాత వెనక్కి తిరిగి చూడగా ఆమె కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె బీచ్ లో గల్లంతై ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Vizag, RK Beach, Woman missing

Leave A Reply

Your email address will not be published.