శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి…

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సోమవారం రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణం, భూగర్భ గనుల శాఖ మంత్రి,రాజంపేట ఎంపీ, లోకసభ ప్యానల్ స్పీకర్, వైసీపీ లోకసభ పక్ష నేత,ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.వేకువ జామున కుటుంబ సమేతంగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.

2024లో కూడా వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని స్వామి వారిని కోరుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు తెలిపారు.టీటీడీ చైర్మన్ ఏవి.సుబ్బారెడ్డి అధ్వర్యంలో తిరుమల చాలా పరిశుభ్రంగా వుందని చెప్పారు.భక్తులకు సౌకర్యంగా స్వామి వారి దర్శనం,తీర్థ ప్రసాదాలు,నిత్య అన్నదానం జరుగుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.