బరిలోకి తేల్చుకుందాం రా… ప్రతిపక్ష నాయకులకు- ఏమ్మేల్యే చంటిబాబు సవాల్

ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలు కూడా మెండుగా ఉండాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న కిర్లంపూడి లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతోపాటు వివిధ వ్యాధులకు చెందిన రోగులకు ఏర్పాటుచేసిన ఉచిత మెగా0 వైద్య శిబిరం లో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి చంటి బాబు పై విధంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యుడు జ్యోతుల చంటి బాబు కీ కిర్లంపూడి ఎంపీపీ తోట రవి అలాగే జడ్పిటిసి తనయుడు తోట గాంధీ తోపాటు స్థానిక Y.M.C చైర్మన్ పెంటకోట నాగబాబు అలాగే సొసైటీ అధ్యక్షుడు చదలవాడ బాబీ ల నాయకత్వం లో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇప్పటికే గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాల్గు మండలాలకు గాను రెండు మండలాల్లో క్యాంపు నిర్వహించడం జరిగిందని చంటి బాబు అన్నారు. అదేవిధంగా కిర్లంపూడి మండలం లో కూడా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ క్యాంప్ ల వల్ల గ్రామీణ ప్రాంత వాసులకు ఎంతో మేలు జరగనుందని ఎమ్మెల్యే అన్నారు. ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా తమ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేయనుందని చంటి బాబు అన్నారు. అదేవిధంగా తనని నియోజకవర్గంలో అప్రదిష్టపాలు చేసేందుకు తాను మాట్లాడిన మాటలను సోషల్ మీడియా వేదిక ద్వారా వక్రీకరించి దుష్ప్రచారానికి వడికట్టడం ప్రతిపక్ష నాయకుల యొక్క దిగజారుడు తనాన్ని తేట తెల్లం చేస్తుందని తెలిపారు. తాను పార్టీమారుతున్నన్నా ఆరోపణలు రావడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే చంటిబాబు తెలిపారు. తాను పోటీ చేసినప్పుడు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు పాతిక వేల మెజారిటీ పైచిలుకు ఓట్లు అందిస్తే పార్టీ మారవలసిన అవసరం ఏమైనా ఉందా అని ఆయన ఎదురు ప్రశ్నించారు. రాష్ట్రంలో సమర్థవంతమైన ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ఎమ్మెల్యే గా కొనసాగుతున్న తనకి అడ్డదారులు తొక్కవలసిన అవసరం తనకు గానీ తన కుటుంబానికి గానీ ఎన్నడు రాజాలదని ఎమ్మెల్యే గంటా పదంగా చెప్పారు. తాను అన్నది తనముందు పనిచేసిన ప్రతిపక్ష నాయకులను దృష్టిలో ఉంచుకొని మాట్లాడేనే తప్ప తన గురించి మాత్రం ఏ విధమైన మాటలు మాట్లాడకపోయినా కొంతమంది ఆవారా గాళ్లు పనిగట్టుకొని సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేయడం చాలా సిగ్గుచేటని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి తానే పోటీ చేయడం జరుగుతుందని విజయ దుందుభి కూడా తానే మ్రోగిస్తానని ఎమ్మెల్యే చంటిబాబు అన్నారు. ప్రతిపక్ష నాయకులకు ఏం మాట్లాడాలో తెలియక మతిభ్రమించే ఈ విధమైన ఆరోపణలు చేయడం వారి యొక్క ఆత్మ విమర్శ వదిలేస్తున్నానని ఎమ్మెల్యే చంటి బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రముఖులు తోట రామస్వామి, కర్రీ సూర్య కుమార్, అలాగే వైస్ ఎంపీపీ బొడ్డేటి గణపతి, నాయకులు తోట విష్ణుమూర్తి, దోమాల గంగాధర్, శెట్టి సోమరాజు, కంచుచుమర్తి రాఘవ, మల్ల నాగబాబు, ఆడారి మహేష్, ఎల్లపు నానాజీ, శరకణం సంతోష్, పీలా లోవ, ఆడారి గంగబాబు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చంద్ర కిరణ్ బృందం సభ్యుల తో పాటు తదితర కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు గ్రేస్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.