ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు.

ఈ సందర్భంగా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.