భీమవరం సభలో చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు

భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోదీతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్, రాష్ట్ర మంత్రి రోజా, మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

అయితే ఈ సభపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభలో తన అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారని అన్నారు. ఆ మహా నటులందరికీ తన అభినందనలు అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకాని సంగతి తెలిసిందే.
Tags: Nagababu, Chiranjeevi, Narendra Modi, Jagan, Roja, Pawan Kalyan, BJP YSRCP, Janasena, Bhimavaram

Leave A Reply

Your email address will not be published.