కుప్పం లో టీడీపీకి ఝలక్: పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో శ‌నివారం ఆ పార్టీకి చెందిన 244 మంది వైసీపీలో చేరారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మ‌క్షంలో ఈ చేరిక‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ కుప్పంలో టీడీపీకి ‌ఝల‌క్ త‌గిలింద‌ని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి భారీగా వైసీపీలోకి చేరిక‌లు జ‌రిగాయని ఆయ‌న తెలిపారు.

వారం ముందు టీడీపీకి చెందిన 100 మంది నేత‌లు వైసీపీలో చేరార‌ని పెద్దిరెడ్డి చెప్పారు. తాజాగా మ‌రో 244 మంది టీడీపీని వీడి వైసీపీలోకి చేరార‌ని ఆయ‌న తెలిపారు. ఫ‌లితంగా కుప్పంలో వైసీపీ మ‌రింత బ‌లోపేతం అయింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప‌థ‌కాలు అనేక మందిని వైసీపీ వైపు ఆక‌ర్షితుల‌ను చేస్తున్నాయ‌ని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.