వైసీపీలో రగులుతున్న కుంపట్లు

విజయవాడ, జూలై 5, (ఎఫ్ బి తెలుగు): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సజ్జల రామ కృష్ణా రెడ్డి, ఇంకో కీలక పదవిలో ఇంకొక రెడ్డి .. ఇలా పార్టీలో , ప్రభుత్వంలో అంతటా, ఆ రెండు అక్షరాలదే హవా… ఈమాటలు అన్నది, అంటున్నదీ ఎవరో కాదు, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో క్రియాశీలంగా మెలుగుతూ, పార్టీ గెలుపు కోసం శక్తీ వంచన లేకుండా, అహర్నిశలు శ్రమించిన అన్య ‘కుల’ కార్యకర్తలు నాయకులు. ఇందులో ఎస్సీలున్నారు, ఎస్టీలున్నారు. ఓసీ లున్నారు. బీసీలు, మైనారిటీలున్నారు. అందరిలోనూ అసంతృప్తి వుంది.అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడీ మాత్రం, అదేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పడు, అన్య సామాజిక వర్గాల నాయకులు, కార్యకర్తలు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.

ఈ మధ్యనే, వైసీపీ పార్టీకి అనుబంధ సంఘాల ప్రకటించారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల విభాగాలకు మాత్రం ఆయా వర్గాలకు ఇచ్చారు. ఇతర సంఘాలు అన్నింటినీ ఆ ‘రెండు’ అక్షరాల సామాజిక వర్గానికే కట్ట బెట్టారు. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను ప్రకటించారు. అందులో అత్యధికులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారనే ఆరోపణలు పార్టీలో బలగా వినిపిస్తున్నాయి.కాగా, అనుబంధ సంఘాల బాధ్యులుగా నియమితులైన వారిలో … ‘బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నాగిరెడ్డి, పూనూరు గౌతంరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, పామిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పుత్తా ప్రతాప్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కల్పలతా రెడ్డి, మేడపాటి వెంకట్ రెడ్డి, సునీల్ పోశింరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి ఇలా, అందరి పేరు ఆ రెండు అక్షరాలతోనే ముగుస్తుంది. ఇందులో ఐటీ, సోషల్ మీడియా, పార్టీ ఆఫీస్, యూత్ వింగ్, రైతు విభాగం ఇలా అన్నీ ఉన్నాయి. అయితే ఎందుకనో ఏమో కానీ, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్ మైనార్టీ, బీసీ, ఎస్టీ, ఎస్టీల సంఘాలకు మాత్రం ఆయా సామజిక వర్గాలకే బాధ్యతలు ఇచ్చారు.

ఇలా ఒకే ఒక్క సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం పై విమర్శలు వస్తున్నా, పార్టీ మాత్రం, అవేమీ పట్టించుకోవడంలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలానే కాదు, ఓసీలకు జగన్ రెడ్డి మొండి చేయి చుపారని, అయన దృష్టిలో ఒక్క రెడ్లు వినా, ఓసీలు, ఇతర సామాజిక వర్గాలు కనిపించవు అనే విమర్శలు వినవస్తున్నాయి.అయితే, ఇప్పడు ఇతర సామాజిక వర్గాలు వైసీపెలో తమకు జరుగతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాయి.మా వాటా మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. సామజిక న్యాయం పేరిట, పొరుగు రాష్ట్రానికి చెందిన బీసీ సంఘం నాయకుడు ఆర్ . కృష్ణయ్యకు ఏకంగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన జగన్ రెడ్డి పార్టీని నమ్ముకుని పని చేస్తున్న బీసీలు, ఇతర సమాజిక వర్గాలను మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే, తిరుబాటు తప్పదని, పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

Source: NewsPulse

Leave A Reply

Your email address will not be published.