ఉదయం రాజీనామా … సాయంత్రం ఉప సంహరణ ప్రకటన

ఉదయం ఎంపీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటనచేసి సాయంత్రం ఉపసంహరణ చేసుకున్నట్లు మీడియా సమావేశంలో ఓ మహిళ ఎంపిటిసి తెలిపారు. బుధవారం ఉదయం తవణంపల్లి మండలం దిగువ మాగం సెగ్మెంట్ ఎంపీటీసీ నాగమ్మ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో తమకు గుర్తింపు గాని అభివృద్ధి సంక్షేమ పథకాలు గాని ప్రజలకు అందడం లేదన్నారు.

ప్రజలకు సమాధానం చెప్పలేక రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇతరుల మాట విని ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేశామని .. చేసిన విమర్శలను వెనక్కి తీసుకుంటున్నామని దిగువ మాగం ఎంపీటీసీ నాగమ్మ తెలిపారు చిత్తూరు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మా పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆ సందర్భంలో కొందరు మాటలు విని రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యామని తరువాత నిజాలు తెలుసుకున్నామని తెలిపారు.

నిజాలు తెలుసుకోకుండా చెప్పిన వారి మాటలు చేసిన పొరపాటు చింతిస్తున్నామని.. తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది తెలిపారు పూతలపట్టు నియోజకవర్గం లోని తమ సెగ్మెంట్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.