ఉత్తమ రచయిత్రిగా మంత్రి రోజా కుమార్తె అన్షు మాలిక…

ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. రోజా కుమార్తె అన్షుమాలిక జీ టౌన్ మ్యాగజైన్ ఉత్తమ రచయిత్రిగా ఎంపికవడమే అందుకు కారణం. దీనిపై రోజా ట్వీట్ చేశారు. “నా బంగారుతల్లి అన్షు మాలిక రాసిన ఓ పుస్తకం జీ టౌన్ మ్యాగజైన్ సౌత్ ఇండియా నుంచి ఉత్తమ రచయిత కేటగిరీలో ఎంపికైంది” అని వెల్లడించారు. అన్షు మాలిక ఈ అవార్డును ప్రముఖ బాలీవుడ్ నటి సాజన్ చేతుల మీదుగా అందుకుందని రోజా తెలిపారు. కోల్ కతాలోని హోటల్ క్లారిడేల్ లో ఈ అవార్డుల కార్యక్రమం జరిగిందని వివరించారు.

రోజా కుమార్తె అన్షుమాలిక రచయిత్రిగా, యూట్యూబర్ గా, యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ గా రాణిస్తోంది. గతంలో అన్షు మాలిక యంగ్ సూపర్ స్టార్ అవార్డు దక్కించుకోగా, ఇన్ ఫ్లుయెన్సర్-యూకే మ్యాగజైన్ పై ఆమె ఫొటోను కవర్ పేజీగా ప్రచురించారు.

అంతేకాదు, బోర్న్ అచీవర్ మ్యాగజైన్ పైనా క్వీన్ ఆఫ్ టాలెంట్ అంటూ అన్షు మాలిక ముఖచిత్రాన్ని వేశారు. అన్షు మాలిక సామాజిక సేవలోనూ ముందంజ వేస్తోంది. హైదరాబాద్ లో చీర్స్ ఫౌండేషన్ ద్వారా ఐదుగురు పిల్లలను చదివిస్తున్నట్టు మంత్రి రోజా ఇటీవల తన కుమార్తె గురించి చెప్పారు.
Anshu Malika, Best Author, Award Roja, Andhra Pradesh

Leave A Reply

Your email address will not be published.