తెలంగాణ క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వం రేపే…

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో మ‌రో ల్యాండ్ మార్క్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి సిద్ధ‌మైంది. న‌గ‌రంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు క‌మాండ్ కంట్రోల్ భ‌వ‌న నిర్మాణం పూర్తయ్యింది. ఈ భ‌వ‌నాన్ని గురువారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఈ భ‌వ‌నం ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌… ఆ భ‌వ‌నం ప్రాధాన్యాన్ని వివ‌రిస్తూ బుధ‌వారం సాయంత్రం ఓ ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ స‌మీకృత క‌మాంట్ అండ్ కంట్రోల్ సెంట‌ర్ (టీఎస్‌పీఐసీసీసీ) పేరిట నిర్మించిన ఈ భ‌వనం ప్ర‌పంచ శ్రేణి ప్ర‌మాణాల‌తో నిర్మించిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. దేశంలోనే అత్యంత సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌భుత్వ భ‌వ‌నంగా దీనికి గుర్తింపు ల‌భించ‌నుంది అని ఆయ‌న పేర్కొన్నారు. గురువారం ఈ భ‌వ‌నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.