వైసీపీలో నేరస్థులకు రేపిస్టులకే ప్రాధాన్యత

ఆంధ్ర రాష్ట్రంలో వైసిపి పార్టీలో రేపిస్టులకు నేరస్థులకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ చిన్నబాబు అన్నారు. శుక్రవారం దేవతా నగర్లోని రాజంపేట పార్లమెంట్ పార్టీ కార్యాలయం నందు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి పార్టీ యువజన పార్టీ కాదని అది శృంగార పార్టీగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిందని ఆయన ఎద్దేవా చేశారు. వైసిపి పార్టీకి చెందిన అంబటి రాంబాబు ఒక గంట రా అని ఒక మహిళతో మాట్లాడడం, మరో మంత్రి అర్ధగంట చాలని అడగడం, నేడు ఎంపీ గోరంట్ల మాధవ్ బట్టలు పూర్తిగా విప్పేసి ఓ మహిళ కు తన శరీరాన్ని మొత్తం చూపించడం పై గాటు వ్యాఖ్యాలు చేశారు. ఆనాడు టిడిపి నాయకులను పచ్చి బూతులతో తిట్టి టికెట్ తెచ్చుకున్న నువ్వు నేడు నీ శృంగారానికి ఉపయోగించుకుంటున్నావని ఎంపీ గోరంట్ల మాధవ్ పై విరుచుకుపడ్డారు.

నేడు దేశవ్యాప్తంగా నీ శృంగార లీలలు చూసి సాటి ఎంపీలందరూ తలదించుకునేలా చేసావని ఎంపీపై విమర్శలు చేశారు. ఒక బీసీ ఎంపీగా నీచంగా మాట్లాడుతుంటే సాటి బీసీలమైన మేము సిగ్గుతో తలదించుకుంటున్నామని అసహనం వ్యక్తం చేశారు. ఏమాత్రం సిగ్గు మానం ఉన్న వైసిపి పార్టీ అధినేత ఎంపీ గోరంట్ల మాధవ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ పార్లమెంట్లో అధిక నిధుల కోసం కొట్లాడి పార్లమెంటు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందే పోయి శృంగారంలో రాటు తేలుతున్నాడని విమర్శించారు. ఆనాడు నారా చంద్రబాబునాయుడు తెచ్చిన కియా కంపెనీని వాటాల కోసం తన్ని తరిమేశాడని ఇటువంటి ఎంపీని ప్రజలు తరిమి తరిమి కొట్టాలని సూచించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఆయన పట్టు పడ్డారు. త్వరలోనే ఎంపీ గోరంట్ల మాధవకు చెప్పు దెబ్బలు పడడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

అనంతరం యాలగిరి దొరస్వామినాయుడు మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలు ,మంత్రులు ,ఎంపీలు వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యలు తీర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి స్త్రీలతో శృంగారాలు మొదలుపెట్టారని ఎద్దేవ చేశారు, ప్రజలందరూ గమనించి వైసిపి పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని గాలికి వదిలేసి వైసిపి పార్టీ నాయకులు అందరూ సినిమా లోని విలన్లను తలపిస్తున్నారని ఆయన అన్నారు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ శృంగార ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.