దేశ సమైక్యతను చాటేలా ఇంటింట జాతీయ జెండా ఎగరాలి – ఎమ్మెల్యే భూమన

దేశ సమైక్యతను చాటేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేయాలని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ప్రజలనుద్దెసించి విజ్ఞప్తి చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ చేతుల మీదుగా సచివాలయ అడ్మిన్లకు జాతీయ జెండాలను పంపిణి చేయడం‌ జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వారోత్సవాలను ప్రజలందరూ దేశభక్తితో స్మరించుకోవాలని, హర్ ఘర్ అమృత్ వారోత్సవాల్లో భాగంగ ఈ నెల 13,14,15 రోజుల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను రెపరెపలాడించాలన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లక్ష జాతీయ జెండాలను ఇంటింటికి పంపిణి చేసే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని, స్వాతంత్ర్య వారోత్సవాల్లో భాగంగా సచివాలయ అడ్మిన్లు మీ పరిదిలోని కార్యదర్శులను, వాలంటీర్లను కలుపుకొని దేశ భక్తి చాటేలా జరుగుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లి వారిని కూడా భాగస్వామ్యం చేయించాలన్నారు.

సచివాలయ సిబ్బంది శ్రద్ద తీసుకొని జాతీయ జెండాలను ప్రజలకిచ్చి వారి ఇండ్లపై ఎగరేయించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సూచించారు. మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి ఆర్టీసి బస్ స్టాండ్ వద్దనున్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు జరిగే హెరిటేజ్ వాక్ ర్యాలిలో పాల్గొనే కార్పరేటర్లు, అధికారులు, సిబ్బంది చేనేత వస్త్రాలు, ఖద్దరు వస్త్రాలు దరించి రావాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనపు సునిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.