జనసేన మళ్లీ ఒంటరి పోరేనా

విజయవాడ, జూలై 4, (ఎఫ్ బి తెలుగు): జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికలను అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. 25 ఏళ్లు రాజకీయాలు చేస్తానన్న పవన్ వచ్చే ఎన్నికల్లో మాత్రం తాను తాడో పేడో తేల్చుకోవాలనుకున్నట్లే కనపడుతుంది. గతంలో మాదిరి అమాయకంగా స్టే‌ట్‌మెంట్ లు ఇచ్చేసి అవతల వారికి అధికారం ఇప్పించే పరిస్థితి పవన్ లో ఇప్పుడు కన్పించడం లేదు. ఆయన సన్నిహితుల వద్ద పవన్ సీరియస్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. 2024లో ముఖ్యమంత్రి పదవి దక్కాల్సిందేనని ఆయన గట్టిగా భావిస్తున్నారు. పొత్తులను పవన్ కాదనడం లేదు. అలాగని అవతలి పక్షం శాసించే విధంగా ఉండకూడదన్నది పవన్ ఆలోచన. జనసేనదే అధికారంలో పై చేయిగా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. చంద్రబాబుతో పొత్తును కుదుర్చుకుంటారు. తొలి దఫా చంద్రబాబును ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారనుకుందాం. జనసేన నుంచి ఒక ముప్ఫయి ఎమ్మెల్యేలు గెలిచారనుకుందాం. వారిని తన పార్టీలో కలిపేసుకోరన్న గ్యారంటీ ఏంటన్నది పవన్ కల్యాణ్ అనుమానం.

2014లో అవసరం లేకపోయినా వైసీపీ ఎమ్మెల్యేలను 23 మందిని తన పార్టీలోకి తీసుకుని వారిలో నలుగురికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారుబాబు ఒంటరిగా పోటీ చేసినా… చంద్రబాబును అంత తేలిగ్గా నమ్మలేమని, ఆయనకు మళ్లీ అధికారం అప్పగించి గెలిచిన ఎమ్మెల్యేలను ఆయన పరం చేయలేమని పవన్ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పొత్తు అవసరం తమకన్నా చంద్రబాబుకే ఎక్కువ అని, ఈసారి ఆయన ఒంటరిగా పోటీ చేసినా గెలవడం కష్టమేనని పవన్ అన్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల ప్రస్తావన అటు నుంచి వచ్చేలా చూడాలని, అప్పుడే తాను అనుకున్న మార్గంలో వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారని సమాచారం.కవేళ విడివిడిగా పోటీ చేసి జనసేన తనకంటూ సీట్లు సాధిస్తే ఎన్నికల అనంతరం కూడా పొత్తుల గురించి మాట్లాడుకోవచ్చని పవన్ అన్నట్లు తెలిసింది. అందుకే పవన్ ఈ రెండేళ్ల పాటు జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా యాభై స్థానాలపై గురిపెట్టి అక్కడ రెండు, మూడుసార్లు ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ బలమైన అభ్యర్థుల కోసం సర్వే కూడా చేయిస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబును నమ్మి పొత్తు కుదుర్చుకుని సీఎం పదవిని అప్పగించే యోచనలో పవన్ కల్యా‌ణ్ లేరన్నది వాస్తవం. అందుకే పవన్ ఈసారి సీఎం కుర్చీపై గట్టిగా కర్చీఫ్ వేశారు.

షాకింగ్ కామెంట్స్
ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ను సమస్యల నుంచి బయటపడేసే బాధ్యతను జనసేనకు అప్పగిస్తే వైసీపీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి కలిగించవచ్చని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్న పవన్ యువతకు ఉపాధి, ఉద్యోగాల్లేవని మండిపడ్డారు. ప్రెస్‌మీట్లు పెట్టి బూతులు తిట్టడానికీ టైం దొరుకుతుంది గానీ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సమయం ఉండటం లేదని ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమం ద్వారా రైతులకు గిట్టుబాటు, కౌలు రైతుల సమస్యలతో పాటు టిడ్కో ఇళ్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్‌, విదేశీ విద్యా పథకం సహా అనేక అంశాలపై ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్న జనసేనాని.. స్పందన కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారం అయితే ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయని నిలదీశారు.

తన నుంచి అద్భుతాలు ఆశించవద్దని, తాను సీఎం ను కానని కేవలం ఒక సగటు మనిషని అన్నారు. ఎన్నికల నాటికి ఎంత మంది నిలబడతారో తెలియదన్న పవన్.. ప్రజల కోసం జనసేన కచ్చితంగా నిలబడుతుందని స్పష్టం చేశారు.ఉద్దానం సమస్య ఎక్కడో మారుమూలగా ఉండేది. మేం మాట్లాడాక ప్రపంచ సమస్యగా మారింది. నాయకుడికి హృదయం ఉండాలి. మనుషులతో మాట్లాడాలి. సమస్యలకు పరిష్కారం వెంటనే రాదు. పదిమందితో మాట్లాడే కొద్దీ పరిష్కారం వస్తుంది. వెనుజులా, శ్రీలంక లాంటి దేశాల్లో వనరులు ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడంతో విఫలమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు వనరులు తక్కువ. దోచేయడానికి మాత్రం రూ.లక్షల కోట్లు దొరుకుతున్నాయి. సమర్థ నాయకత్వం లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.

జనసేన అధినేత, పవన్ కల్యాణ్ భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. భీమవరం నుంచి పోటీ చేసిన వ్యక్తిగా తనకు ఇది ప్రత్యేకమని అన్నారు. ఆజాదీ అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమానికి తనకూ ఆహ్వానం పంపినందుకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.