సీఎం జగన్ విశాఖ టూర్ ఖరారు

ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటనకు వెళుతున్నారు. వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసం ఆయన విశాఖకు వెళ్లబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు. 11.05 గంటలకు ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ కు చేరుకుంటారు. 10 నిమిషాల పాటు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు.

అనంతరం వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్ ఉంటుంది. 11.47 నుంచి 12.17 వరకు జగన్ ప్రసంగం ఉంటుంది. 12.20 నుంచి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. 1.20 గంటలకు గన్నవరంకు తిరుగుపయనమవుతారు.
Tags: Jagan Vizag Tour, YSRCP

Leave A Reply

Your email address will not be published.