రేపు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదు..

YCP Jaggampet MLA రేపు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎవరికి తెలుసంటూ వైసీపీ జగ్గంపేట ఎమ్మెల్యే Jyothula Chantibabu చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను వైసీపీలో శాశ్వతమా? అని వ్యాఖ్యానించారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసని అన్నారు. ‘పార్టీలు, గాడిద గుడ్డు ఈరోజు ఉంటాయి. రేపు పోతాయి. ఏం… మేమైనా శాశ్వతమా ఈ పార్టీలో. చెప్పండి.. ఎవరు ఏ పార్టీలో శాశ్వతంగా ఉన్నారో చెప్పండి.

రేపన్నరోజు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసు?’ అని Sensational Comments చేశారు. ఏ ఒక్కరూ ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో ఒక నాయకుడు అనేవాడు వేరే పార్టీలోకి మారడం సహజమని చెప్పారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.