మధ్యప్రదేశ్ లో ఘోరం.. చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో ముగ్గురు యువతులు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖ్వాండా జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని కొట్ఖేడి గ్రామంలో ముగ్గురు యువతులు శవాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించారు. వీరు ముగ్గురు స్వయానా అక్కాచెల్లెళ్లు. వీరిని సోనూ, సావిత్రి, లలితగా పోలీసులు గుర్తించారు. జావర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇది జరిగింది. చెట్టుకు ఉరేసుకుని, నిర్జీవంగా ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. యువతుల మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కోసం పంపించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ఆరంభించారు. ఘటనా స్థలంలో ఎటువంటి లేఖ లభించలేదు.

దీంతో యువతులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక దీని వెనుక ఎవరి హస్తం అయినా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య వెనుక కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. మృతి చెందిన అక్కా చెల్లెళ్లకు తల్లి, మరో ఇద్దరు సోదరీమణులు, ముగ్గురు సోదరులు ఉన్నారు. అయితే, తల్లి, ఒక సోదరుడితో కలసి వీరు గ్రామంలో నివాసం ఉండేవారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చెట్లకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే ఘటనలు తరచుగా వెలుగు చూస్తుంటాయి.

Leave A Reply

Your email address will not be published.