మొక్కజొన్న కండె 15 రూపాయలా…! అమ్మకందారుతో బేరమాడిన కేంద్రమంత్రి

కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే మధ్యప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆయన సియోనీ, మాండ్లా ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో ఓ చోట రోడ్డు పక్కన మొక్కజొన్న కండెలు అమ్ముతుండడం చూసి కారు దిగారు. మొక్కజొన్న కండెలు అమ్ముతున్న కుర్రాడ్ని పలకరించారు. వాటి ధర ఎంతో తెలుసుకున్నారు.

మూడు కండెలు రూ.45 అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఒక మొక్కజొన్న కండె 15 రూపాయలా…! మరీ ధర ఎక్కువ చెబుతున్నావు బాబూ అంటూ బేరమాడారు. దీనికి సంబంధించి వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ వీడియోను కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వయంగా ట్విట్టర్ లో పంచుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.