సీఈసీ సీక్రెట్ విజిట్….

హైదరాబాద్, జూలై 4, (ఎఫ్ బి తెలుగు): కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ కుమార్, రెండు రోజులుగా హైదరాబాద్’లో ఉన్నారు. మరో రోజు కూడా ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం వర్గాల సమాచారం మేరకు, ఆయన శుక్రవారం హైదరాబాద్ వచ్చారు సీఈసీ హైదరబాద్ రావడం విశేషం కాదు, కానీ, వచ్చిన సమయ సందర్భాల విషయంలో, అదే విధంగా సీఈసీ పర్యటన గురించి, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మీడియాకు అంతగా సమాచారం లేక పోవడం విషయంలో రాజకీయ పరిశీలకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. సహజంగా సీఈసీ లేదా కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికాలు రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం, మీడియాకు సమాచారం అందిస్తుంది. అయితే, ప్రస్తుత పర్యటనకు సంబందించి, సరైన సమాచారం లేదని, ఏంపిక చేసిన మీడియా సంస్థలకు మాత్రమే సమాచారం, అది కూడా అరకొరగా మాత్రమే అందించారని అంటున్నారు. అందుకే, ఎందుకీ, గోప్యత అంటూ ఇటు మీడియా వర్గాలు, అటు రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.

అలాగే, మీడియాకు అందుబాటులో లేకుండా సీఈసీ గోల్కొండ రిసార్ట్ లో బస చేయడం గురించి కూడా అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలాగని సీఈసీ పర్యటనకు ప్రాధాన్యత లేదా అంటే లేక పోలేదు, ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ (ఈవీఎం) తయారుచేసే ఈసీఐఎల్ ను సందర్శిస్తున్నారు. ఈవీఎంలకు సంబందించిన వివిధ అంశాలపై అధికారాలతో చర్చలు జరుపుతున్నారు, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్, ఇతర అధికారులతో, ఎన్నికలకు సంబందించిన వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. నిజానికి ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీలకు ఎప్పటినుంచో అనుమనాలు న్నాయి. కాంగ్రెస్ సహా కొన్ని ప్రధాన పార్టీల నుంచి మళ్ళీ బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ వినవస్తోంది.

మరో వంక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల గురించిన ఉహాగానాలు వినవస్తున్నాయి. ఈ నేపధ్యంలో, సీఈసీ రాష్ట్ర పర్యటనకు చాల ప్రాధన్యత ఉందని పరిశీలకులు అంటున్నారు. అయితే, సీఈసీ గుట్టు చప్పుడు కాకుండా, ఎందుకు వచ్చారు? ఏమి చేశారు? అనే విషయంలో అధికారిక సమాచారం లేక పోవడంతో అనుమానాలు బలపడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఈసీ పర్యటను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకు గోప్యంగా ఉంచింది అనే విషయంలో రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.