ప్రపంచ కుబేరుల్లో గౌతమ్ అదానీకి నాలుగో స్థానం

ముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ స్వల్ప కాలంలో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల తాజా జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నారు. దీని వెనుక ఓ కారణం ఉంది. ప్రపంచ కుబేరుల్లో ఇంత కాలం నాలుగో స్థానంలో ఉన్న బిల్ గేట్స్ 20 బిలియన్ డాలర్లను బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తున్నట్టు గత వారం ప్రకటించారు. తన మొత్తం సంపదను కూడా సమాజానికే ఇచ్చేస్తానని తర్వాత ఆయన హామీ ఇచ్చారు.

ఫోర్బ్స్ రియల్ టైమ్ డేటా ప్రకారం బిల్ గేట్స్ తాజా సంపద 102 బిలియన్ డాలర్లు. గౌతమ్ అదానీ సంపద 114 బిలియ్ డాలర్లు. గతేడాది నుంచి చూస్తే గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యుల సంపద 50 బిలియన్ డాలర్ల నుంచి ఈ స్థాయికి పెరగడం గమనార్హం. ఫోర్బ్స్ రియల్ టైమ్ సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్ 230 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్, అమెజాన్ జెఫ్ బెజోస్ రెండు, మూడో స్థానాల్లో నిలిచారు.
Gautam Adani, Forbes list, worlds richest

Leave A Reply

Your email address will not be published.