ఇండిగో నుంచి ‘స్వీట్ 16’ ఆఫర్.. రూ. 1616కే టికెట్

చవక ధరల విమానయాన సంస్థ ఇండిగో ‘స్వీట్ 16’ పేరుతో బ్రహ్మాండమైన ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థను ప్రారంభించి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని పన్నులతో కలిపి రూ. 1616 ప్రారంభ ధరతో టికెట్‌ను అందిస్తోంది. నిన్న ప్రారంభమైన ఈ ఆఫర్ కింద రేపటి (శుక్రవారం) వరకు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.

 

ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన టికెట్లపై ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది జులై 16 మధ్య ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఈ ఆఫర్‌ గురించి ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకునే అవకాశాన్ని ఈ ఆఫర్ కల్పిస్తోందన్నారు. అయితే, ఈ ఆఫర్‌లో భాగంగా ఎన్ని టికెట్లను విక్రయించేది వెల్లడించలేదు.

Leave A Reply

Your email address will not be published.