స్విమ్మింగ్ లో జాతీయ రికార్డు బద్దలుకొట్టిన నటుడు మాధవన్ కుమారుడు

ప్రముఖ నటుడు మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. మాధవన్ కుమారుడు వేదాంత్ స్విమ్మింగ్ లో జాతీయ రికార్డు బద్దలు కొట్టడమే అందుకు కారణం. 16 ఏళ్ల వేదాంత్ జూనియర్ స్థాయిలో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

భువనేశ్వర్ లో జరుగుతున్న 48వ జాతీయ ఆక్వాటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో వేదాంత్ 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ అంశంలో విజేతగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు అద్వైత్ పగే (16.06 నిమిషాలు) పేరిట ఉండగా, వేదాంత్ (16.01 నిమిషాలు) దాన్ని సవరించాడు.

తన కుమారుడు జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో కొత్త రికార్డు నెలకొల్పిన విషయాన్ని మాధవన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “చేయలేనిదంటూ ఏదీ ఉండదు… 1500మీ ఫ్రీస్టయిల్ అంశంలో జాతీయ జూనియర్ రికార్డు బద్దలైంది” అంటూ ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.