మహారాష్ట్ర లో పెట్రోలుపై రూ. 5, డీజిల్​ పై రూ. 3 తగ్గింపు..

మహారాష్ట్ర ప్రజలకు ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తీపి కబురు చెప్పారు. భారీ పెరిగిన ఇంధన ధరల విషయంలో కొంత ఊరట కల్పించారు. మహారాష్ట్రలో లీటరు పెట్రోలుపై రూ. 5, డీజిల్పై రూ. 3 తగ్గిస్తూ షిండే సర్కారు నిర్ణయం తీసుకుంది. ముంబైలో గత పదకొండు రోజులుగా రూ. 111.35 గా ఉన్న లీటరు పెట్రోలు తాజా తగ్గింపుతో రూ. 106.35కు పడిపోనుంది. ఇప్పటిదాకా రూ. 97.28గా ఉన్న లీటరు డీజిల్ ఇకపై 94.28 కే లభించనుంది. దీనివల్ల వాహనదారులకు కొంత ఊరట లభించనుంది.

ఇతర నగరాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు ముంబైలోనే ఎక్కువగా ఉండటంతో షిండే సర్కారు తాజా నిర్ణయం తీసుకుంది.
బుధవారం నాటికి లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ.96.72, కోల్ కతాలో 106.03, చెన్నైలో 102.63, గువాహతిలో రూ. 96.48గా ఉన్నాయి. లీటరు డీజిల్ రేట్లు ఢిల్లీలో రూ.89.62, కోల్ కతాలో రూ. 92.76, చెన్నైలో 94.24, గువాహతిలో రూ. 84.37గా ఉన్నాయి. ఇక, హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 109.66 కాగా, డీజిల్ రేటు రూ. 97.82గా ఉంది.
fuel, petrol, diesel, Maharashtra, decrease, Eknath Shinde

Leave A Reply

Your email address will not be published.