రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని, యూపీ, తమిళనాడు సీఎంలు

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఎన్డీయే పక్షాల నుంచి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందుగా పోలింగ్ సిబ్బంది నుంచి బ్యాలెట్ పేపర్, పెన్ తీసుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన ఏకాంత గదిలోకి వెళ్లి, ఓటును నమోదు చేసి, దాన్ని మడిచి బయటకు వచ్చి, బ్యాలెట్ బాక్స్ లో వేసిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రధాని వచ్చిన సమయంలోనే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సైతం పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడాన్ని వీడియోలో చూడొచ్చు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలో ఓటు వేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలైంది. రాష్ట్రాల అసెంబ్లీలు, పార్లమెంట్ లోని పోలింగ్ కేంద్రాల్లో ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగుతుంది.

Leave A Reply

Your email address will not be published.