అమృత్‌స‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్‌… సింగ‌ర్ మూసేవాలా హ‌త్య కేసు నిందితుడు హ‌తం

పంజాబ్‌లో ఇటీవ‌లే చోటుచేసుకున్న సింగ‌ర్ సిద్దూ మూసేవాలా హ‌త్య కేసుకు సంబంధించిన నిందితులు, పోలీసుల మ‌ధ్య బుధ‌వారం అమృత్ స‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో మూసేవాలా హంత‌కుల్లో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న జ‌గ‌రూప్ సింగ్ హ‌త‌మ‌య్యాడు. కాల్పుల్లో ముగ్గురు పోలీసుల‌కు కూడా గాయాల‌య్యాయి. ఈ సందర్భంగా రికార్డు అయిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

పంజాబ్‌లో మూసేవాలా హ‌త్య కేసు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో కొత్త‌గా కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం వంద‌ల సంఖ్య‌లో ప్ర‌ముఖుల‌కు క‌ల్పిస్తున్న భ‌ద్ర‌త‌ను తొల‌గించింది. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం అమ‌లులోకి వ‌చ్చిన రోజుల వ్య‌వ‌ధిలోనే మూసేవాలా హ‌త్య ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు… బుధ‌వారం త‌మ‌కు తార‌స‌పడిన నిందితుల‌ను అరెస్ట్ చేసే యత్నం చేయ‌గా… పోలీసుల‌పై నిందితులు కాల్పులు జ‌రుపుతూ త‌ప్పించుకునే య‌త్నం చేశారు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జ‌రిపారు.

Leave A Reply

Your email address will not be published.