‘పుష్ప’ సినిమా డైలాగ్ చెప్పిన ఉద్ధవ్ థాకరే

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, సంజయ్ రౌత్ అరెస్ట్ బీజేపీ నేతృత్వంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ దాడి అని చెప్పారు. గిట్టని పార్టీల నేతలపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలతో దాడి చేయిస్తోందని మండిపడ్డారు. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు.

సంజయ్ రౌత్ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని… ఆయనను చూసి గర్విస్తున్నానని థాకరే చెప్పారు. ‘పుష్ప’ సినిమాలో ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ ఉందని.. అలాగే సంజయ్ రౌత్ కూడా ఎవరికీ తలొగ్గే మనిషి కాదని తెలిపారు. బాల్ థాకరే నిజమైన శివసైనికుడు రౌత్ అని కొనియాడారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ… బీజేపీ బెదిరింపులకు లొంగకపోవడమే సంజయ్ రౌత్ చేసిన నేరమని అన్నారు. రౌత్ ఎంతో ధైర్యం కలిగిన వ్యక్తి అని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.