నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన టీడీపీ ఎంపీలు

భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము చారిత్రాత్మక విజయం సాధించడం తెలిసిందే. ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగిన ముర్ము తన ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పీఠం అధిరోహించిన రెండో మహిళ ముర్ముయే. ఈ నేపథ్యంలో, ముర్ముపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ద్రౌపది ముర్మును కలిశారు. పుష్పగుచ్ఛం అందించి ఆమెకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ విషయాన్ని ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ లో వెల్లడించారు. సహచర ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ లతో కలిసి వెళ్లి భారత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపినట్టు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.