మరికొన్ని గంటల్లో తేలనున్న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు

ఈ నెల 18న భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరికొన్ని గంటల్లో ఫలితం వెల్లడి కానుంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని ఇప్పటికే అధికార బీజేపీ ఢంకా బజాయిస్తోంది. దేశ ప్రథమపౌరుడి ఎన్నికల్లో ముర్ముపై విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీచేశారు. అయితే ఆయనకు గెలుపు అవకాశాలు చాలా తక్కువని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితం లాంఛనమే కానుంది.

కాగా, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంటు భవనంలో ప్రారభం కానుంది. మొదటిగా ఎంపీల ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఆల్ఫాబెట్ క్రమంలో ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్యెల్యేల ఓట్లు లెక్కిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు.
Presidential Election, Votes Counting, India

Leave A Reply

Your email address will not be published.