పగ పట్టిన పాము: ఇద్దరు సోదరులు మృతి

ఉత్తరప్రదేశ్ లో విషాదంలో మరో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో ఓ వ్యక్తి మరణించగా, అతడి అంత్యక్రియలకు వెళ్లిన సోదరుడు కూడా పాముకాటుకు బలయ్యాడు. ఈ ఘటన భవానీపూర్ గ్రామంలో జరిగింది. అరవింద్ మిశ్రా అనే వ్యక్తి మంగళవారం నాడు పాముకాటుతో మరణించాడు. అతడి సోదరుడు గోవింద్ మిశ్రా (22) లూథియానాలో ఉండగా, సోదరుడి మరణవార్త విని భవానీపూర్ వచ్చి, అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

గోవింద్ మిశ్రాతో పాటు వారి బంధువు చంద్రశేఖర్ పాండే (22) అనే యువకుడు కూడా వచ్చాడు. వీరిద్దరూ ఒక గదిలో పడుకుని ఉండగా, ఇద్దరినీ పాము కరిచింది. గోవింద్ మిశ్రా మరణించగా, చంద్రశేఖర్ పాండే పరిస్థితి విషమంగా ఉంది. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Aravind Mishra, Snake Bite, Govind Mishra, Brother, Uttar Pradesh

Leave A Reply

Your email address will not be published.