పాముకాటుతో మృతి చెందిన కొడుకు.. బతికొస్తాడని 30 గంటలపాటు పూజలు!

పాముకాటుతో మృతి చెందిన కుమారుడు బతికొస్తాడని ఆశతో ఓ కుటుంబం 30 గంటలపాటు పూజలు చేసింది. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా జటవాన్ మొహల్లా గ్రామంలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తాలీబ్ శుక్రవారం పాముకాటుకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

అయితే, వైద్యుల మాటలను విశ్వసించని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చనిపోయిన వ్యక్తిని మళ్లీ బతికించుకోవచ్చని చెబుతూ తాంత్రికుడిని, పాములు పట్టే వ్యక్తిని తీసుకొచ్చారు. తాలీబ్ మృతదేహం చుట్టూ వేపమండలు, అరటి కొమ్మలు పెట్టి దాదాపు 30 గంటలపాటు మృతదేహం వద్ద పూజలు చేశారు. అయినప్పటికీ తాలిబ్‌లో చలనం కనిపించకపోవడంతో నిన్న సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
Uttar Pradesh, Snake Bite, Mainpuri, Jatawan Mohalla

Leave A Reply

Your email address will not be published.