ఆజాధికా అమృత్ మహోత్సవం లో భాగంగా చేగుంటలో బైక్ ర్యాలీ

చేగుంటలో ఈ రోజు చేగుంట మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆజాధికా అమృత్ మహోత్సవంలో భాగంగా తీరంగా బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది.ఈ బైక్ ర్యాలీని రాష్ట్ర బీజేపీ నాయకురాలు కర్ణం పరిణీత జండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు.బైక్ ర్యాలీలో భాగంగా వడియారం జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి చేగుంట పురవీదుల గుండా మెదక్ రోడ్డు, స్టేషన్ రోడ్డు, మక్కరాజ్ పేటల రోడ్డు మీదుగా గ్రామ పంచాయతీ నుండి గాంధీ విగ్రహం వరకు నిర్వహించి తిరంగా ర్యాలీ ఔన్నత్యాన్ని వక్తలు వివరించి మాట్లాడారు.

ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ ఆజాధికా అమృత్ మహోత్సవంలో స్వాతంత్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా దేశ ప్రధాని,దేశ పార్టీ అధ్యక్షుడు,రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు,దుబ్బాక శాసన సభ్యుడు రఘునందన్ రావ్ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంలో దేశభక్తిని పెంపొందిస్తూ ప్రతి పౌరుడు ప్రతి మండల కేంద్రంలోని,ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటిమీద ఖచ్చితంగా జండా ఎగురవేయడం తో పాటు దేశభక్తిని పెంపొందించే యువతను మోటివేట్ చేయాలని,దేశ రక్షణకు పాటుపడే విధంగా యువతకు జాతీయ భావాలు పెంపొందించాలాని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.