గిరిజన బిడ్డలపై మీకు ఎందుకింత కోపం?
తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పోడు సాగు చేస్తున్న గిరిజనులు అక్కడే గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వీరు పోడు భూములను ఆక్రమించారంటూ పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే యత్నం చేశారు. ఈ క్రమంలో గిరిజనులను వారి గుడిసెల నుంచి బలవంతంగా తరలించే యత్నం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఓ మహిళ తన గుడిసె నుంచి వెళ్లిపోయేందుకు నిరాకరించగా… ఆమెను మహిళా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గిరిజన మహిళ దుస్తులు ఊడిపోతున్నా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం.