సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు!

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ స్కోర్ కార్డును cbse.gov.in, results.cbse.nic.in వెబ్ సైట్లలో రోల్ నంబర్, స్కూల్ నంబర్లను ఉపయోగించి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 12వ తరగతిలో 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షల్లో అమ్మాయిలు సత్తా చాటారు. 94.54 శాతం మంది అమ్మాయిలు పాస్ కాగా… 91.25 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు.

టర్మ్ 1, టర్మ్ 2 వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఫైనల్ మార్క్ షీట్లను సీబీఎస్ఈ తయారుచేసింది. విద్యా సంవత్సరంలో సాధించిన ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కులు, ప్రాజెక్ట్ వర్క్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, ప్రీబోర్డ్ ఎగ్జామ్స్ మార్కులు స్కోర్ కార్డులో ఉంటాయి. ఏప్రిల్ 26 నుంచి జూన్ 4 వరకు టర్మ్ 2 పరీక్షలు జరిగాయి. టర్మ్ 1 పరీక్షలను గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించారు.

CBSE result,12th Class Results

Leave A Reply

Your email address will not be published.