మొక్కలు నాటిన డిసిపి జగదీశ్వర్ రెడ్డి

ఎంతోమంది అమరవీరుల త్యాగాల ద్వారా ప్రజలందరికీ స్వతంత్రం లభించిందని అలాంటి భారతదేశం 75 వసంతాల సంబరాలు నిర్వహించడం సంతోషకరమని శంషాబాద్ జోన్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలలో భాగంగా శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో బుధవారం రోజు శంషాబాద్ జోన్ డీజీపీ జగదీశ్వర్ రెడ్డి, శంషాబాద్ ఏసిపి భాస్కర్ వేముల రూరల్ సీఐ శ్రీధర్ కుమార్ తో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ శంషాబాద్ జోన్ పరిధిలో ప్రజలందరూ స్వచ్ఛందంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్,ఏస్ఐ సత్య కుమార్, ఎస్సై బలరాం ఎస్సై ప్రశాంత్ రెడ్డి ఎస్సై రాజకుమార్ ఎస్ఐ రాజేష్ జమిందార్ పాండు బుగ్గయ్య కానిస్టేబుల్స్ అంజిబాబు చంద్రశేఖర్ హోంగార్డ్ యాదగిరి ఇతర మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల కార్యక్రమంలో భాగంగా శంషాబాద్ ఏసిపి భాస్కర్ వేముల పాల్గొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఎస్సై దేవరాజు ఏస్ఐ భానుమతి. ఏస్ఐ సుమన్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.