పిల్లలతో సమయం గడపండి, తల్లిదండ్రులకు దేవనాథ జీయర్ స్వామి సూచన

రోజులో కొంత సమయం తప్పనిసరిగా పిల్లలతో గడపాలని తల్లిందండ్రులకు పరమహంస పరివ్రాజకులు త్రిదండి దేవనాథ జీయర్ స్వామి పిలుపు నిచ్చారు. విశాఖ బీచ్ రోడ్ లోని వారిజ ఆశ్రమం (చిన్న జీయర్ స్వామి వారి నిర్వహణలో వేద పాఠశాల ) లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న దేవనాథ జీయర్ స్వామి ఆదివారం తల్లిదండ్రులు, పెద్దలతో సమావేశమయ్యారు. దేశ సౌభాగ్యం, సుసంపన్నం, పరిరక్షణ కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఆశ్రమంలో శ్రీ లక్ష్మి యాగం 27 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు నిత్యా పూర్ణాహుతి అనంతరం భక్తులకు మార్గదర్శకం చేస్తున్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత బిజీ పరిస్థితుల్లో తల్లిందండ్రులు డ్యూటీల్లో చెయ్యడం వలన పిల్లలతో మాట్లాడడానికి కూడా సమయం ఉండడం లేదన్నారు. దీని ప్రభావం గా పిల్లలు ఒంటరిగా మిగిలి, తమతో మాట్లాడే వారు లేక, మొబైల్, లేదా ట్యాబు లతోనే సహచర్యం చేస్తున్నారన్నారు. తద్వారా వారికి ఇతరులతో మాట్లాడే అవకాశం లేని కారణంగా కొన్ని విపరీత స్వభావం అలవాడుతుందన్నారు. ఇటీవల రెండు రోజుల క్రితం తమ వద్దకు ప్రస్తుతం కెనడా లో నివాసం ఉంటున్న ఓ కుటుంబం సభ్యులు రావడం జరిగిందని, వారి పిల్లవాడు రెండేళ్ల వయసు వరకూ అందరి లాగానే మాట్లాడేవాడని, ఆ సమయంలోనే వీరు కెనడా వెళ్లడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆ పిల్లవాడు మాట మాట్లాడడం తగ్గించేసాడన్నారు. దీనికి ఒక కారణం అక్కడ వాతావరణంలో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లడం, పిల్లవాడితో సమయం గడిపే అవకాశం లేకపోవడం కూడా కావచ్చన్నారు. ప్రస్తుతం ఆ పిల్లవాడి వయసు 8 సంవత్సరాలన్నారు. దీనికి ఆయుర్వేదం లో తెలియచేసిన అమృత ప్రశ్న మందు వాడమని సూచించారు. దీనికి అదనంగా ప్రతి రోజూ ఆ పిల్లవాడితో ఇంట్లోని వారందరూ అవిశ్రాంతంగా మాట్లాడుతూ ఉంటె. .అతనికి కూడా వాళ్ళతో సంభాషించే ఉత్సుకత వస్తుందన్నారు. ఈ సమావేశంలో సమైక్య ఉద్యమ యువజన సంఘాల ప్రతినిధి, స్వచ్ఛ్ భారత్ రికార్డ్ గ్రహీత ఆడారి కిషోర్ కుమార్, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.